కల్వకుర్తి నియోజకవర్గం లోని వివిధ మండలాలలో శుక్రవారం రాత్రి ఏడు గంటల నుండి ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఈదురుగాలుల వల్ల రోడ్లపై చెట్లు ఎక్కడికక్కడ కూలిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది..దీంతో స్థానిక పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంతో వాహనాలు యధావిధిగా బయలుదేరాయి...