వైనతేయ గోదావరి నదీ తీరంలో క్షణం క్షణం భయం భయం అన్న విధంగా పరిస్థితి ఉంది. మామిడికుదురు మండల పరిధిలోని పలు గ్రామాల్లో 15 రోజుల నుంచి గోదావరి నదీ కోత శృతి మించింది. నెల నెలా ఆదాయాన్ని ఇచ్చే కొబ్బరి చెట్లు కూలి పోతున్నాయి. సారవంతమైన భూములు నదీ గర్భంలో కలిసి పోతున్నాయి.