పేద ప్రజలకు వైద్య సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు.ఇటీవల వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉపశమనం కలిగించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జగ్గంపేట స్థానిక టిడిపి కార్యాలయంలో నవీన్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.