ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో నేడు సోమవారం రోజున ఉదయం మావోయిస్ట్ లకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా మారిన మావోయిస్ట్ లు అంటూ, అమాయక ఆదివాసి యువతను కోవర్ట్ ల పేరుతో హతమార్చుతున్నారని, తెలంగాణ పల్లెలు సహకరిచక పోవడంతో చత్తీస్ఘాడ్, మహారాష్ట్రలో స్థావరాలు ఏర్వాటు చేసుకున్న మావోయిస్ట్ లని, జనజీవన స్రవంతిలో కలిసి పోరాడాలని, ఆదివాసీలు ఎవరు సహకరిచవద్దని లేఖలో పేర్కొన్నారు.