జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ లో యూరియా లోడులారీని రైతులు అడ్డుకున్నారు,తమకు సరిపడా యూరియా అందంచటంలేదని ప్రాథమిక వ్యవసాయ సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు.గత కొంతకాలంగా యూరియా కొరత ఉండటంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని,పంటలు రోగాల బారీన పడుతున్నాయని వాపోయారు.ఇదే విషయంలో అధికారులతో వాగ్వివాదానికి దిగారు,పోలీసులు వచ్చి శాంతింపజేశారు,యూరియా సరిపడా ఇవ్వాలని లేకపోతే ఆందోళన చేపడుతామని రైతులు డిమాండు చేశారు...