ప్రకాశం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో భారీ వర్షం కారణంగా తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ వాగు వద్దకు వెళ్లి ప్రజలకు తగు సూచనలు చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో రాకపోకలు సాగించడానికి ప్రయత్నం చేయవద్దు అన్నారు. అలా చేయడం వల్ల ప్రాణానికి ముప్పు ఉంటుందన్నారు. వాగు ఉధృతి తగ్గేంతవరకు వాగు దాటే ప్రయత్నం ఎవరు చేయవద్దని హెచ్చరించారు.