గత వైసీపీ ప్రభుత్వంలో పాడా నిధుల ద్వారా పులివెందుల నియోజకవర్గం లోని అంబకపల్లె గంగమ్మకుంటకు 14 ఎకరాల భూసేకరణ కోసం రూ. 1.40 కోట్లు వేయించి, మరో కోటి రూపాయలతో కొత్తచెరువును నిర్మించారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ నిధులతో రూ 2. 50 కోట్లు వేచించి హీరోజ్ పురం గ్రామం వద్ద భారీ షాంపును ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 4.50 కిలోమీటర్ల మేర అంబకపల్లె చెరువుకు పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటిని విడుదల చేశారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగమ్మ కుంట చెరువుకు జల హారతి ఇచ్చే కార్యక్రమం చేయనున్నారు.