సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. తలమడ్ల వద్ద రైల్వే పనులు పూర్తి కావడంతో ముందుగా డెమో ట్రైన్ తో రైల్వే అధికారులు ట్రాక్ చేశారు. అనంతరం తిరుపతి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్ప్రెస్ ను పంపించారు. 36 గంటల పాటు రైల్వే పనులను కొనసాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి.