యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మోత్కూరు గుండాల మండలాల్లో యూరియా కోసం సోమవారం రైతులు బారులు తీరారు ఈ సందర్భంగా పలువూరు రైతులు మాట్లాడుతూ సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతాంగానికి తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని సకాల సమయానికి యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామని యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.