శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో పలాస ఎమ్మెల్యే గౌతు శీరిషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను అక్కడ జనం ఖండిస్తున్నారు. పేదలను అడ్డం పెట్టి రాజకీయాలు చేయవద్దంటున్నారు. ఎమ్మెల్యే శీరిష పలాస కాశీబుగ్గ పట్టణంలోని తోపుడు బల్లుపై వెయ్యిరూపాయలు అక్రమ వసూలు చేస్తున్నారంటు మాజీ మంత్రి అప్పలరాజు చేసిన ఆరోపణలు ఆసంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తాము చేసే వ్యాపారానికి రోజుకు అంత సంపాదించలేమన్నారు. అయిన తమ పేర్లుతో ప్రస్తుత ఎమ్మెల్యే శీరిషమ్మ కుటుంబంపై బురదజల్లడం అప్పలరాజుకు తగదన్నారు.