జిల్లాలోని 29 మండలాలకు మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తయిందని డీఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఎంఈవోలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తక్షణమే పంపిణీ చేసేలా చొరవ తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభం రోజున విద్యార్థులందరికీ పుస్తకాలను అందజేయాలని పేర్కొన్నారు.