ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాహనమిత్ర పధకం అమలు చేయాలి..ఆటోడ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు శుక్రవారం కొత్తూ రు మండల కేంద్రంలో ఆటోడ్రైవర్ యూనియన్ సిఐటియు ఆద్వర్యంలో నిరశన ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లును ఆదుకోవడంలో విఫలమైందని , మహిళలకు ఉచిత బస్సు పధకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లును వాహనమిత్ర పధకం ద్వారా 25000.రూపాయిలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకివచ్చాక గాలికి వదిలేసారని అన్నారు..