ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలలో దాదాపు 12 రోజులపాటు చేపల వేట నిలిచిపోవడంతో తమ జీవనానికి గడ్డి పడిందని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం తెలిపారు. తుఫాను కేంద్రం మరో మారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి వర్షాల కురుస్తాయని వెల్లడించింది. దీంతో మరో మారు చేపల వేట నిలిచే అవకాశం ఉందని జాలర్లు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు