జిమాడుగుల మండలం కుంబిడిసింగి వద్ద కొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గ్రామం నుండి మండల కేంద్రానికి చేరుకునేందుకు కొంతమంది గిరిజనులు వాగు దాటే క్రమంలో వాగు ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో వెనుతిరిగి గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమస్యపై అధికారులకు ఎన్నోమార్లు విన్నవించినప్పటికీ ఎవరు స్పందించడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఉన్న చిన్న కల్వర్టుపై వాగు ఉధృతి ఎక్కువ అవ్వడంతో గ్రామాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని, సంబంధిత శాఖల అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.