జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా పి.గోవింద రాజులు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా డీపీఆర్వోగా పని చేస్తున్నారు. గోవిందరాజులు ఇంతకుముందు జిల్లాలో ఏపీఆర్వోగా, డివిజనల్ పీఆర్వోగా, ఇంచార్జి డిపిఆర్వోగా కూడా పని చేశారు. తాజాగా ఇక్కడ పదోన్నతిపై ఏడిగా నియమితులు కావడంతో, త్వరలో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.