నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని గ్రామంలో బుధవారం షరాఫ్ వేలం పాట ప్రశాంతంగా నిర్వహించారు, మల్యాల గ్రామానికి చెందిన వడ్డే రాముడు 2,81000 షరాఫ్ పాటను దక్కించుకున్నారు, గత ఏడాది మూడు లక్షల 50 వేలకు పలికిన షరాఫ్ వేలంపాట ఈసారి 69,000 వేలకు తక్కువ పాట పాడడంతో రైతు కమిటీకి ఆదాయం తగ్గింది, షరాఫ్ వేలంపాటలో ఎలాంటి ఉద్రిక్తత జరగకుండా రైతు కమిటీ సభ్యులతో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, అర్బన్ ఎస్ఐ చంద్రశేఖర్ చర్చలు జరిపి వేలంపాటను ప్రశాంతంగా నిర్వహించారు.