రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం రాత్రి ప్రముఖ గాయని ఎస్పీ శైలజ సంగీత విభవరి ప్రేక్షకులను అలరించింది. రాక సాంస్కృతిక సంస్థ మరియు గోదావరి కల్చర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ శైలజ తో పాటు రాజమండ్రి కి చెందిన పలువురు వైద్యులు స్వర్గీయ ఎస్పీ బాలు పాడిన పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు. ఎస్పీ బాలువును స్మృతిస్తూ ఈ సంగీత విభావరి కొనసాగింది.