మదనపల్లె పట్టణంలో కోడిపందెం ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం మదనపల్లె సీఐ కళా వెంకటరమణ తెలిపారు.చంద్రకాలనీ సమీపంలో పెద్దఎత్తున కోడిపందెం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, డీఎస్పీ మహేంద్ర ఆదేశాల మేరకు ఎస్సై చంద్రమోహన్ సిబ్బందితో కలిసి శిబిరాలపై దాడులు నిర్వహించారు.ఈ సోదాల్లో రెండు పందెం కోళ్లు, రూ.5,500 నగదు, ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. కోడిపందెంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.