సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వనపర్తి జిల్లా నార్కోటిక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరా పై కట్టుదిట్టమైన నిగా ఉండాలని పాఠశాలలు కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్ లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి పర్యవేక్షణ ఉండాలని ఆదేశాలు ఇచ్చారు జిల్లాలో 2025 సంవత్సరాలకు ఆరు కేసులు నమోదైనట్లు తెలిపారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి వాడకం ఎక్కడైనా జరుగుతున్నట్లు అనుమానం వస్తే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.