బందరు పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన స్పెషల్ సిఎస్ కృష్ణబాబు బందర్ పోర్టు నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ( స్పెషల్ సిఎస్) ఎం.టి కృష్ణ బాబు శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో పరిశీలించారు. ఫీజ్ వన్ నిర్మాణ వ్యయం రూ.5,235.48కోట్లు అంచనా కాగా మొత్తం 16 బెర్తులగాను ఫేస్ వన్ లో 4 బెర్తులు నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోర్ట్ ను అక్టోబర్ 2026 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్య మంత్రి ఆదేశమన్నారు.