కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. స్థానికులు తెల్సిన వివరాల మేరకు శనివారం గురు వైన్స్ షాపు ఎదురుగా వినాయకుని ఊరేగింపు చూసి తిరిగి రోడ్డు దాటుతున్న యువకున్ని అటుగా వస్తున్న స్కార్పియో కారు వేగంగా ఢీ కొనగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడు జమ్మలమడుగుకు చెందిన గురు సాయి (25) గా గుర్తించారు. క్షతగాత్రుడిని వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.