నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ప్రాజెక్టు వరద తగ్గడంతో గేటు పోసి వేసినట్లు శుక్రవారం ప్రాజెక్టు అధికారి మధు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 1,137.95 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.50 అడుగులుగా ఉందన్నారు. మూసి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.07 టిఎంసిలు నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి మధు తెలిపారు.