రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని వికారాబాద్ ఎంపీడీవో వినయ్ కుమార్ తెలిపారు. శనివారం మండల కార్యాలయంలో ఎంపీడీవో వినయ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ఓటర్ లిస్ట్ లోని మార్పులు అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని వారికి తెలిపారు.