ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట లో గల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయుల నాటికట్టడం రామప్ప దేవాలయాన్ని జర్మనీ దేశస్థులు నేడు శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు సందర్శించారు. జర్మనీకి చెందిన జిష్టాన్ నిమాస్ ఆలయాన్ని దర్శించుకొని, ఆలయ గైడ్ గోరంట్ల విజయ్ ద్వారా ఆలయ శిల్పకళా సౌందర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శిల్పకళాలను చూసి అబ్బుర పోయారు.