వినాయక చవితికి పోలీసుల సూచనలు నాగలాపురం మండలంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ సునీల్ తెలిపారు. విగ్రహం ఎన్ని రోజులు ఉంచుతారన్న వివరాలు, విగ్రహ నిమజ్జనం తేదీ తెలపాలన్నారు. వినాయక చవితి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. డీజే సౌండ్ సిస్టంకు అనుమతి తప్పనిసరి అన్నారు. పోలీసు నిబంధనలు అతిక్రమిస్తే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు.