సత్యవేడు: ‘భూసార పరీక్షలు చేసుకోవాలి' పంటలకు ఎరువులు వాడే ముందు రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించుకునేలా చూడాలని సత్యవేడు వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం కోరారు. శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో తిరుపతి డీఆర్సీ ఆధ్వర్యంలో ఖరీఫ్ పంట సాగు, ఏపీఏ ఐఎంఎస్ యాప్పై వ్యవసాయ సిబ్బందికి అవగాహన సదస్సు జరిగింది. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. పంట సాగులో ఎరువులను సరైన మోతాదులో ఉపయోగించాలన్నారు.