పిడుగురాళ్లలో రైల్వే ట్రాక్పై ఇద్దరు యువకుల మృతదేహాలు పిడుగురాళ్ల మండలం జానపాడు వద్ద రైల్వే ట్రాక్పై సోమవారం ప్రయాణికులు ఇద్దరు యువకుల మృతదేహాలు గుర్తించారు.పోలీసులు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు గాంధీనగర్కు చెందిన షేక్ షరీఫ్, దాసుగా గుర్తించారు. గత రాత్రి వారు తమ స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ పక్కన మద్యం తాగి ఘర్షణ పడినట్లు మృతుల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో రైలు కింద పడ్డారా లేదా ఎవరైనా చంపి అక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.