ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయలపల్లి వాసి గుత్తా వెంకటేశ్వర్లు అతడి ముగ్గురు పిల్లలు నాలుగు రోజుల క్రితం అదృశ్యమై బుధవారం ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసినదే. తాజాగా ఇద్దరు పిల్లలు వర్షిని శివధర్మ మృతదేహాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పనుంతల మండలం సూర్య తాండ సమీపంలో లభ్యమయ్యాయి. వారిని తండ్రి పెట్రోల్ పోసి కాల్చి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మోక్షిత కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.