అమాయక ప్రజలను మోసం చేసి చిట్టీల పేరుతో ఓ మహిళ పరారైన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది శుక్రవారం రోజున పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక శాంతినగర్లో నివసించే స్వప్న గత 14 ఏళ్లుగా స్థానికంగా ఉంటూ చిట్టీల వ్యాపారం చేస్తోంది. చిట్టీలు ఎత్తుకున్న వారు ఇటీవల ఆమెను డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దాదాపు 200 మంది వద్ద సుమారు రూ.3 కోట్ల మేర డబ్బులు తీసుకుని పరారైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.