నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగులు వేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో “ఓపెన్ ఫోరం” కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పౌరులు ఎల్‌ఆర్‌యస్, నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలపై అర్జీలు సమర్పించారు. పలువురు సందేహాలను వ్యక్తం చేయగా, కమిషనర్ నివృత్తి చేశారు. కొన్ని సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పౌరులు కూడా కమిషనర్ దృష్టికి తీసుకోరాగ, అక్కడిక్కడే పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, ప్లానింగ