రాష్ట్రంలోని ఇమామ్ మౌజనులకు జీతాలు అందించకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని జిల్లా కలెక్టరేట్ ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని సంగమేశ్వర సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు. గత 11 నెలల నుంచి వారికి జీతాలు అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ నేతలు హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.