ఎరువులు, యూరియాను అందించడం, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఉదయం 11 గంటలకు కర్నూలు లో 'రైతు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలు, ఎరువులు, యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న అధికార పార్టీ నేతల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9న ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు