చిరు ఉద్యోగులైన అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి దావీదు డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీ కార్య కర్తలు కొలిమిగుండ్లలో నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, తహశీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం ఇచ్చారు.