తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 12, 13వ తేదీల్లో ఆటో కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు ఆంధ్ర ఆటో వాలా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్తిరాజు తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. ఐదు రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో తాము వాహనాలను నిలుపుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.