అనంతపురం : గత నెలలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఉల్లంఘనలపై చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలు బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాకు వెల్లడించారు.జిల్లా ఎస్పీ జగదీష్ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది గత నెలలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎం.వి. కేసులు నమోదు చేశామన్నారు.హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 15,245 కేసులు నమోదు చేశారు. రూ. 53,27,079/- లు ఫైన్స్ వేశామన్నారు.