రామకుప్పం మండలంలోని సింగసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. వెంకటేశ్ కుమారుడు సంజయ్ (9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్కు స్థానికంగా వైద్యం చేయించిన తగ్గకపోవడంతో కుటుంబీకులు తిరుపతి స్విమ్కు తరలించారు. సంజయ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని గుర్తించిన వైద్యులు అతనికి డయాలసిస్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.