రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తి SKZR రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నం.1 రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. మృతుడికి 60-65 ఏళ్ల వయసు ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేనందువల్ల మృతదేహాన్ని KZR మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.