విశాఖలోని నగరాలవీధిలో నివసించే సత్యనాల శేఖర్, నారాయణమ్మ దంపతుల జీవితం ఎప్పుడూ నవ్వులు, సంతోషాలతో నిండి ఉండేది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. సమాజం ఆడపిల్లలను చూసే కోణాన్ని పక్కన పెట్టి, వారిని కుమారుల వలే పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువులు చదివించారు. వారి ఆశలన్నీ ఆ ఇద్దరు కుమార్తెల మీదే. పెద్ద కుమారె‍్త భాగ్యశ్రీ , సీఐ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చిన్న కుమార్తె గాయిత్రీ మాధురి, మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇదిలావుండగా ఆరు నెలల క్రితం వారి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ స్నేహితులతో కలిసి యారాడ సముద్ర తీరానికి వెళ్లింది.