మునికమగలవీడు గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించాలని కోరుతూ, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ,నెల్లికుదురు మండలంలో మండు వేసవిలో తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ,తాగునీటి ఎద్దడి నివారించాలని అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని, గ్రామస్తులు బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి అక్కడినుంచి తరలించి ట్రాఫిక్క్ పునరుద్ధరించారు.