ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు వల్ల మృతి చెందిన గొర్రెల విషయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బిజెపి నాయకులు చెల్లా నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు అంబటిపల్లి గ్రామంలో పిడుగుపాటు భారీ వర్షాల కారణంగా మృతి చెందిన గొర్రెల విషయంలో నష్టపోయిన వారిని పరామర్శించి వారికి అండగా ఉంటానంటూ మద్దతుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.