ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.