తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసాలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ ముందు భైఠాయించారు.తమకు నెల నెల జీతాలతో పాటు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. చాలిచాలని వేతనాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే తమకు రూ.16,500 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఒక్కో కార్మికుడి నుంచి రూ.2500 వసూలు చేశారని ఆరోపించారు.అలాగే తమ పీఎఫ్ డబ్బులు 5 సంవత్సరాలను సాలరీ నుండి కటింగ్ చేస్తున్న ఎలాంటి సమాచారం లేదన్నారు.తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు