కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మద్దికేర జొన్నగిరి ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గ్రామాల్లో కలిసిమెలిసి ఉండాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతత జీవితాన్ని కొనసాగించాలని పోలీసులు తెలిపారు.