మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గం అలంపూర్ డివిజన్లోని అలంపూర్ జీకే పాయింట్ కడిచుర్ గల్లీలు ,గాయత్రి నగర్,60 పట్ రోడ్డు, హరిహర టెంపుల్ ఆపోజిట్ తులసి నగర్ ప్రాంతాలలో శనివారం కార్పొరేటర్ సబి హ గౌసుద్దీన్ జలమండలి అధికారులు గాయత్రి నగర్ సెక్షన్ మేనేజర్ తో కలిసి బస్తీలలో పర్యటించారు. అవసరమైన చోట భూగర్భ డ్రైనేజీ పనుల కోసం ఎస్టిమేషన్ కొరకు పరిశీలనలు జరిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇంకా అభివృద్ధి చేపడుతామని తెలిపారు.