ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం కారణంగా పర్యావరణం దెబ్బతింటోందనిని ప్రకృతిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం తగ్గించి మట్టి వినాయకులను పూజించాలని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి శ్రీమతి బీసీ ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.ఈనెల 27వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను పూజించాలని కోరుతూ ఆమె సొంత ఖర్చుతో తయారుచేయించిన మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు