జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రజా పాలన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ లు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.