కాణిపాక ఆలయంలో బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆల ఏఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ వినాయక చవితి పురస్కరించుకొని ఆలయానికి సుమారు 70వేల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.