పెడనలో యూరియా సరఫరాపై రైతులకు అవగాహన జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశాల మేరకు పెడన మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మద్యాహ్నం 3 గంటల సమయంలో వ్యవసాయ శాఖ, రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు ప్రత్యేక పర్యటనలు నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశమై యూరియా కొరతపై ఉన్న అపోహలను తొలగించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా జరుగుతుందని, జిల్లా స్థాయిలో తగినంత స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.