వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..రాయచోటి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 23 కోట్ల 75 లక్షల రూపాయలతో 50 పడకల 3 అంతస్తుల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మించబోతున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరు చేసి 605 కోట్లు కేటాయించిందని, అయితే రాష్ట్రం వాటా ఇవ్వకపోవడం వల్ల ఒక్క బ్లాక్ కూడా పూర్తికాలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం 240 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మూడు సంవత్సరాలలో కేవలం 38 కోట్లు మాత్రమే ఇచ్చి పనులను అడ్డుకుందని అన్నారు.