అల్లూరి ఏజెన్సీలో టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ అధికారుల ముందస్తు సమాచారంతో చేసిన దాడుల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎక్సైజ్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరాల ప్రకారం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన గంజాయిని పెదబయలు మండలం గోమంగి వద్ద టిప్పర్ లారీలో లోడ్ చేసి జార్ఖండ్ రాంచి గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని రూటు వాచ్ చేస్తున్న క్రమంలో బొలెరోలో వస్తున్న ముగ్గురిని విచారించగా ఈ వివరాలను వెల్లడించారని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. పట్టుకున్న గంజాయి ముప్పై లక్షలు ఉంటుందన్నారు.